Friday, February 20, 2026

మున్సిపల్ చైర్పర్సన్ సహకారంతో రైతు బజార్ ను అభివృద్ధి చేస్తాం. వికారాబాద్ ఏ ఏం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్.

నేటి సాక్షి వికారాబాద్ వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతు బజార్ ను వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ. ప్రతిక్ జైన్ అదనపు కలెక్టర్ శ్రీ.సుదీర్ వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం శ్రీ అనన్య తో కలిసి రైతు బజార్ ను సందర్శించడం జరిగింది. రైతు బజార్ లో ఉన్నటువంటి సమస్యలను రైతుల ద్వారా తెలుసుకొని మార్కెట్ కమిటీ చేర్మెన్ శ్రీనివాస్ ముదిరాజ్ విజ్ఞప్తి మేరకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని త్వరలోనే దీనికి సంబందించిన ఉత్తర్వులను తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ.గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.రైతులకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ గడ్డం. శ్రీ అనన్య వికారాబాద్ అభివృద్ధి నీ ఆకాంక్షిస్తూనారని అందులో మొదటగా రైతుబజార్ సమస్య తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు…..ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చేర్మెన్ అర్ధ.సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చేర్మెన్ విశ్వనాథం సత్యనారాయణ, డీసీసీబి డైరెక్టర్ కిషన్ నాయక్ , జిల్లా మార్కెటింగ్ అధికారి మార్కెట్ కమిటీ సిబ్బంది మార్కెట్ డైరెక్టర్లు రమేష్ నాయక్, రాజు నాయక్, విజేందర్ రెడ్డి, నాగి రెడ్డి, పాపి రెడ్డి, వట్టం నర్సింలు, మిర్యానం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News