ప్రజా అభిప్రాయం మేరకే అభివృద్ధి పనులుసిఎం, మంత్రి లక్ష్మన్కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకంనేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మున్సిపాలిటీ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని అంగడి బజార్లో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పడ్డ 18 మున్సిపాలిటీల అభివృద్ధికి అర్బన్ లోకల్ బాడీ పథకం కింద రూ.270 కోట్లు నిధులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారని అన్నారు. కాగా రాయికల్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వం రాయికల్ మున్సిపాలిటీ కేటాయించిన రూ.25 కోట్ల నిధులను ప్రణాళిక లేకుండా పనులు చేపట్టారని విమర్శించారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలే తప్ప అవసరంలేని పనులు చేపట్టడంతో నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులను ప్రజా అభిప్రాయం మేరకు అభివృద్ధికి కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మహిళ అధ్యక్షురాలు తాటిపాముల మమత,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మ్యాకల అనురాధ,షర్మిల, లత,నాయకులు కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,ఎద్దండి దివాకర్,బత్తిని భూమయ్య,వాసం దిలీప్, షాకీర్,కడకుంట్ల నరేష్,మున్ను, షంషీర్,అశోక్,మోబిన్,రాకేష్ నాయక్,రాజేష్,సంతోష్,నరసింహారెడ్డి,రాజారెడ్డి,ఆనందం, లక్ష్మీనారాయణ,రవి,తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 13 RKL03: సిఎం, ఇతర నేతల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం





