Friday, March 20, 2026

ములకలచెరువులో ప్రశాంతంగా ముగిసిన ఎస్టీయూ సమావేశం..ఎస్టీయూ అధ్యక్షుడిగా ఖాదర్ వలీ, మండల ప్రధాన కార్యదర్శి గా జయరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో బుధవారం ఎస్టీయూ సభ్యుల సమక్షంలో సమావేశం సజావుగా జరిగింది. ఈ సందర్భంగా సభ్యుల మద్దతుతో ములకలచెరువు మండల ఎస్టీయూ అధ్యక్షుడిగా ఖాదర్ వలీ, మండల ప్రధాన కార్యదర్శిగా జయరాం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఎన్నిక పట్ల ఎస్టీయూ అధ్యక్షులు అమరనాథ్ రెడ్డి, శ్రీరాములు, ఖాదర్ వలి, నౌషాద్, ప్రభాకర్ రెడ్డి, గంగాద్రి, రాజారెడ్డి, శ్రీనివాసులు, ఉమ్మడి రమణ, రహంతుల్లా, కృష్ణారెడ్డి, మల్లికార్జున, భాస్కర్ రెడ్డి, రామకృష్ణ, మంజులమ్మ, శ్రీనివాసులు, కొట్టాల రాజ రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు. మరి కొంత మంది వివిధ కేటగిరీలో ఎన్నికైన వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒకే ఒక డి.ఏ మంజూరు చేసిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పన్నెండో వేతన సంఘం చైర్మన్ నియామకం, ముప్పై శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిల విడుదల, ఉమ్మడి సేవా నియమావళి అమలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు, పి.ఎఫ్‌ మరియు ఏ.పీ.జి.ఎల్‌.ఐ రుణాల మంజూరు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సంక్రాంతి పండుగకు ముందుగా సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితిలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నట్లు అమరనాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు అమరనాథ రెడ్డి, రాజారెడ్డి, శ్రీరాములు, కృష్ణా రెడ్డి, నౌషాద్, మల్లికార్జున, భాస్కర్ రెడ్డి, రామాంజులు, ఈశ్వరయ్య, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News