Saturday, March 21, 2026

ములకలచెరువు కేజీబీవీ విద్యార్థినీల ప్రతిభ..జాతీయ జెంబోరీలో అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థినీల అద్భుత ప్రదర్శన..

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక కేజీబీవీ విద్యార్థినీలు ములకలచెరువు మండలానికి వన్నెతెచ్చారు. జాతీయ జెంబోరీలో అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ మేరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీఈవో సుబ్రహ్మణ్యం అభినందనలతో ముంచెత్తారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గత నెల 22 నుండి 29 వరకు నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జెంబోరీలో పాల్గొనిఅద్భుత ప్రతిభ చూపిన అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్లు, విద్యార్థులను గురువారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీఈవో సుబ్రహ్మణ్యంలు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ జాతీయ జెంబోరీలో నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియా దేశాలతో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది పాల్గొనగా అన్నమయ్య జిల్లా నుంచి 62 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. జిల్లా కంటిన్జెంట్ లీడర్‌గా గుర్రంకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గురునాథరెడ్డి వ్యవహరించారన్నారు. జెంబోరీలో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, బ్యాండ్, క్యాంప్ ఫైర్, క్యాంప్ క్రాఫ్ట్, స్టేట్ గేట్, టెంట్ ఏర్పాటు, పైనీరింగ్, రంగోలి తదితర విభాగాల్లో జిల్లా విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబర్చారు. అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా సర్టిఫికెట్లు పొందారు. జెంబోరీ ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. జెంబోరీ కార్యక్రమం ముగిసిన అనంతరం గురువారం జిల్లాకు చేరుకున్న విద్యార్థులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీఈఓ సుబ్రహ్మణ్యం లు ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ములకలచెరువు కేజీబీవీ విద్యార్థినీలు మాట్లాడుతూ జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, సేవాభావం, స్వయంకృషి, బృందస్ఫూర్తి వంటి విలువలను ప్రత్యక్షంగా నేర్చుకున్నామని తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో కలసి మెలసి, వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలను తెలుసుకుంటూ సాంస్కృతిక మార్పిడిని ఆస్వాదించామన్నామని విద్యార్థినిలు మమత, సానియా, తస్మియా, మాన్విత, అమృత, భార్గవి, సుహాసిని, ఉదయశ్రీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, స్కౌట్ మాస్టర్స్ నితిన్ రెడ్డి, ప్రేమ సాగర్, చినబాబు, ఖాదర్ భాషా, గైడ్ కెప్టెన్లు నిర్మల, లక్ష్మి, తిరుమల దేవి, రేష్మ, వివిధ పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News