Monday, March 16, 2026

ములకలచెరువు నూతన ఎస్ఐ గా ప్రతాప్ బాధ్యతలు స్వీకరణ..అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి పై ప్రత్యేక దృష్టి..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 26 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా శుక్రవారం ప్రతాప్ బాద్యతలు స్వీకరించారు. అనంతరం సిఐ వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండల భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ములకలచెరువు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాల తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన, అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ కు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్ఐ ప్రతాప్ కు పోలీసు సిబ్బంది నూతన శుభాకాంక్షలు తెలిపారు. దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి సన్మానించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ నరసింహుడు రాయచోటి సీసీఎస్ 1 కు బదిలీపై వెళ్ళారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు. పార్టీలకతీతంగా ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తనను నేరుగా వచ్చి కలవచ్చని సూచించారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ మేరకు ఎస్ ఐ ని సన్మానించిన వారిలో సిబ్బంది రైటర్ వెంకటరమణ, ఏఎస్ఐ హేమ సుందరం, హెడ్ కానిస్టేబుల్ లు సాదిక్ అలీ, విజయ్ కుమార్, సిబ్బంది చిరంజీవి, నాగిన్ భాష పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News