నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 26 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఆకస్మికంగా విచ్చేసి తనిఖీ చేపట్టారు. స్టేషన్ లోని పలు రికార్డులను, కేసుల పరిష్కార విధానంపై ఆరా తీశారు. పెండింగ్ కేసులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం శక్తి యాప్ వల్ల ఉపయోగాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. రాత్రి పూట గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎవరైనా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా పేకాట, కోడిపందాలు, మత్తు పదార్థాలైన గంజాయి, హాన్స్, గుట్కా, నాటు సారా తయారీ, విక్రయం, లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం, శ్రీ గంధం స్మగ్లింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. మండలంలో ఏవైనా గొడవలు ఇతర ఘటనలు ప్రజల దృష్టికి వస్తే తమకు తెలియజేయాలని తక్షణమే వారిపై చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర సర్కిల్ పరిధిలోని ఎస్ ఐ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని 31 అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైకి తాగి వచ్చి న్యూసెన్స్ చేసిన బాణాసంచా పేలుస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేషులు, ఎస్ ఐ ప్రతాప్, ఏఎస్ఐ హేమ సుందరం, రైటర్ వెంకట రమణ, హెడ్ కానిస్టేబుల్ లు సాదిక్ అలీ, విజయ్ కుమార్ సిబ్బంది చిరంజీవి, నాగిన్ భాష తదితరులు పాల్గొన్నారు.~~~~~~~~~~~~~~~~~~

