నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణ మున్సిపాలిటీ పరిధిలో తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీ లోపాలు ఉన్నాయని కోరుట్ల డెవలప్మెంట్ ఫోరం ఉపాధ్యక్షులు మిర్జా ముఖ్రమ్ బేగ్ ఆరోపించారు.లోపాలను వెంటనే సవరించాలని సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు.*స్థానికంగా నివసించని వారి పేర్లు చేర్పు.?*15వ వార్డు సహా పలు వార్డుల్లో గత 15–20 సంవత్సరాలుగా ఆ వార్డులో నివసించని వ్యక్తుల పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యవహించారని అభిప్రాయపడ్డారు.*ఇతర వార్డుల ఓటర్లు 15వ వార్డులో..?*ఇదేక్రమంలో ఇతర వార్డులకు చెందిన 100–150 మంది ఓటర్ల పేర్లు 15వ వార్డులో ప్రచురితమయ్యాయని తెలిపారు. ఇలాంటి పొరపాట్లు ఎన్నికల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.*లోపాలు సరిదిద్దాలని అధికారులకు విజ్ఞప్తి*ఈ లోపాలను సరిదిద్దాలని కోరుతూ ఆయన మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఆర్డీవో జివాకర్ రెడ్డి, ఎమ్మార్వో చైతన్య కృష్ణ లకు వినతిపత్రాలు అందజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను పునఃపరిశీలించి న్యాయసమ్మతంగా సవరణలు చేయాలని ఆయన అధికారులు కోరారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ నిజమైన ఓటర్ల పేర్లు మాత్రమే జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మిర్జా ముఖ్రమ్ బేగ్ డిమాండ్ చేశారు._____

