చేర్యాల: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేర్యాల జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో ముస్త్యాల గ్రామంలో శీతాకాల శిబిరం 4 రోజు శనివారం ముస్త్యాల గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది చెత్త వేయకు పాపం చేయకు యువత మేలుకో మత్తు వదులుకోఅంటూ గ్రామంలోని అన్ని వీధులలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్ గంగయ్య మాట్లాడుతూ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అవి బాగున్నప్పుడే దేశం బాగుంటది అదేవిధంగా ప్రతి మనిషి పరిశుభ్రత సమాజ పరిశుభ్రత సిహెచ్ యాదగిరి మాట్లాడుతూ కష్టం ద్వారా ఏదైనా సాధించవచ్చు మరియు చదువు లేని వ్యక్తి సమాజంలో ఏమి చేయలేడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమాజానికి తన యొక్క కుటుంబానికి మేలు చేయగలడుఅని విద్యార్థులకు సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు





