నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
బక్రీద్ పండుగ నేపథ్యంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ జి. బక్కయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ అధ్యక్షతన ఏరియా పశు వైద్యశాల మెట్ పల్లి లో ముస్లిం మత పెద్దలతో ముందస్తుగ పశువధ గురించి, వాటికీ సంబంధించిన నియమాలు గురించి వివరించడం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ బక్కయ్య మాట్లాడుతూ గోవధ అనేది చట్ట రీత్యా నేరం అక్రమంగా గోవులను రవాణా చేసిన వధించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను దూడలను (మగవి,ఆడవి) ఎట్టి పరిస్థితులలో ఉద్దేశ్యపూర్వకంగా చంపకూడదు.ఎద్దు, దున్న, గేదె మొదలైన వాటిని చంపాలంటే వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే వ్యవసాయానికి, బ్రీడ్ డెవలప్మెంట్ కి పూర్తి నిరుపయోగంగా వున్నాయని ప్రభుత్వము నియమించిన పశువైద్యాధికారి ధ్రువీకరించిన సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రభుత్వ పశువైద్యాధికారి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాల)లలో మాత్రమే వధించాలన్నారు.ఇండ్లల్లో ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం మాంసాన్ని విక్రయించడం నేరమని, కాగ్నిజబుల్ నేరం కింద వస్తుందన్నారు. అక్రమ గోవుల రవాణ వాహనాలు మనకు కనబడగానే వాటిని ఆపి 100కి కాల్ చేసి, పోలీస్ వారికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాలి పట్టుకున్న గోవులను పోలీసులు సురక్షితంగా రిజిస్టర్ అయిన గోశాలకు తరలించాలని, అలాగే అక్రమ రవాణ చేస్తున్న వారిమీద అమ్మినవారు, కొన్నవారి మీద శిక్ష పడేలా కేసు నమోదు చేయాలని తెలిపారు.తదనంతరం స్థానికంగా ఉన్న పశువధశాలను తనిఖీ చేయడం జరిగింది కావున పశువుల విక్రయదారులు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగప్రసాద్, డాక్టర్ నరేష్ రెడ్డి, డాక్టర్ అశోక్, డాక్టర్ మనీషా పటేల్ మరియు పశువైద్య సహాయక సిబ్బంది మురళి, రాజేష్, ఖాజా ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు

