నేటి సాక్షి వికారాబాద్ :రంజాన్ సందర్బంగా వికారాబాద్ పట్టణం ఆలంపల్లి దర్గా వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను కలిసి, ఆత్మీయ ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BRS పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ఈ సందర్బంగా ఆయన…. రంజాన్ ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వికారాబాద్ మండలం పుల్మద్ది గ్రామంలోని వికారాబాద్ మండల BRS పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షులు గయాజ్ గారి ఇంటికి వెళ్లిన ఆయన గ్రామంలో నూతనంగా గెలిచిన BRS పార్టీ వార్డు సభ్యులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.





