నేటిసాక్షి, మిర్యాలగూడ : మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారం పుస్తెల తాడు చోరీ చేసిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ 2వ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….శుక్రవారం మధ్యాహ్నం బంగారుగడ్డకు చెందిన శిరంశెట్టి లక్ష్మీ (55) సం.ల యొక్క మెడలో నుంచి సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును, తన వెనకాల నుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి మెడలో నుంచి అపహరించుకొని వెళ్ళినారని ఫిర్యాదు చేసినట్లు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు వారు విలేకరులకు వివరించారు.





