- ఎమ్మెల్యే చొరవతో 12న ప్రారంభం
- హర్షం వ్యక్తం చేస్తున్న చొక్కారావుపల్లె జనం
నేటి సాక్షి, గన్నేరువరం: మండలంలోని చొక్కారావు పల్లి గ్రామంలో పుష్కరకాలంగా మూతపడి ఉన్న ప్రాథమిక పాఠశాలకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో మోక్షం లభించనున్నది. సకల సౌకర్యాలతో ఈ నెల 12న ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మూతపడి శిథిలమైన పాఠశాల భవనాన్ని మరమ్మత్తులు చేపట్టి ప్రారంభత్సవానికి అనుకూలంగా గ్రామస్తుల సహకారంతో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామంలో విద్యార్థులు పాఠశాల సౌకర్యం లేక ఇతర గ్రామాలకు, ప్రైవేటు పాఠశాలను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. నేడు ఇక ఆ బాధలు లేకుండా గ్రామంలోనే విద్యార్థులు చదువుకునేలా పాఠశాలను సిద్ధం చేసి ఉపాధ్యాయులను కేటాయించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.