Saturday, March 21, 2026

మూతపడ్డ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనాలి సిపిఎం పార్టీ డిమాండ్

నెటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి నవంబర్ 7 కాగజ్ నగర్ లో మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమ స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాగజ్ నగర్ లో నాలుగు దశాబ్దాల క్రితం సర్ సిల్క్ మిల్లు మూతపడింది. ఈ మిల్లు మూసివేతతో అప్పట్లో సుమారు నాలుగు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఈ మిల్లు స్థలాన్ని ఈ వేలం వేయనున్నట్లు అఫిషియల్ లిక్విడేటర్, ప్రతినిధులు కాగజ్ నగర్ లోని పలు చోట్ల బ్యానర్లు కట్టారు. పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. ఈ మిల్లు స్థలాన్ని వేలం వేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి వారి వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.కావున ఈ స్థలాన్ని ప్రభుత్వమే అఫిషియల్ లిక్విడేటర్ నుండి కొనుగోలు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తే కాగజ్ నగర్ పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉ పాధి కల్పించినట్లవుతుంది. అలాగే పిల్లల ఆట స్థలానికి గ్రౌండ్ కు మరియు ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఇదే సమయంలో పలుసార్లు ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలంలో నూతన పరిశ్రమ స్థాపించేందుకు కృషి చేస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీలు కూడా ఇచ్చారు. కావున స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తేవాలని కోరుతున్నాను.ఈ ప్రాంత ఉన్నతాధికారిగా మీరు మా విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మిల్లు స్థలం ప్రభుత్వమే కొనుగోలు చేసి, అక్కడ నూతన పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ముంజం ఆనంద్ కుమార్ దుర్గం దినాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News