Friday, March 20, 2026

మూసి దోమల వల్ల రోగాలు రావుసీనియర్ ఎంటామాలిజిస్ట్ నామాల శ్రీనివాస్

నేటి సాక్షి నవంబర్( నేటి సాక్షి (నవంబర్ 28:రాజేంద్రనగర్:మూసిలో పెరిగే దోమల నుంచి జ్వరాలు రావని చార్మినార్ జోన్ సీనియర్ ఎంటామాలిజిస్ట్ నామాల శ్రీనివాస్ అన్నారు.ఫ్రై డే డ్రై డే సందర్భంగా అత్తాపూర్ డివిజన్ పరిధిలోని,హైదర్ గూడ ప్రాంతం లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు దోమల పై వాటివల్ల వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా నామాల శ్రీనివాస్ మాట్లాడుతూ. మూసి సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలు దోమల గురించి భయపడాల్సిన పని లేదని,మూసిలో పెరిగే క్యూలెస్ దోమ జాతివల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు రావనీ వీటి వల్ల కేవలం న్యూసెన్స్ మాత్రమే ఉంటుదని పేర్కొన్నారు.ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలను వారం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదని,నీటి నిలవలలో తోక పురుగులు ఉంటే వాటిని పారపోయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్, సూపర్వైజర్ నారాయణ,ఆశా కార్యకర్తలు, ఎంటామోలోజీ సిబ్బంది,విద్యార్థులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News