నేటి సాక్షి ఉమ్మడి వరంగల్(సందెల రాజు): శుక్రవారం ఉదయం గుండె పోటుతో పరమపదించిన హనుమకొండ మండల తహసీల్దార్ కర్ర శ్రీపాల్ రెడ్డి భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య, అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్ లు, అధికారులు. విధి నిర్వహణలో నిత్యం ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేసిన శ్రీపాల్ రెడ్డి మరణ వార్త చాలా బాధాకరమని ఎమ్మెల్యే నాయిని విచారం వ్యక్తం చేశారు. శ్రీపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

