నేటి సాక్షి ధర్మపురిజగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు శాతాల్ల నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాతాల్ల నారాయణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారితోపాటు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, కాశెట్టి రాజేష్, తిమ్మాపూర్ కాంగ్రెస్ నాయకులు లిఫ్ట్ చైర్మన్ వావిలాల ప్రకాష్, లింగాల హరీష్ గౌడ్ కాళ్ళ సత్తయ్య, కుమ్మరి నవీన్, కడారి సంపత్ రెడ్డి, మోతె సత్తయ్య కార్యకర్తలు గ్రామ ప్రజలు మరియు తదితరులు ఉన్నారు.




