నేటి సాక్షి, తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తాళ్లపల్లి మహేష్ గౌడ్ ఇటీవల చనిపోగా, మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, మాజీ వైస్ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పలువురు దాతల సహకారంతో రూ. 45వేలు అందజేశారు. ఉపసర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుంభం శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యులు భీరం మహేశ్వరీ, కనపర్తి చంద్రశేఖర్, వార్డు సభ్యులు గోనెల స్వప్న-సది, కుంభం లక్ష్మి-అశోక్, బోయిని సంగీత-సతీష్, పోతుగంటి అనిల్, కొర్రి వంశీ, బావండ్ల ప్రవీణ్, బోయిని శంకరయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.




