నేటి సాక్షి గజ్వేల్ : గజ్వేల్ మండలంలోని అనంతరావుపల్లి గ్రామానికి చెందిన గద్ద పెద్ద యాదయ్య అనారోగ్య కారణాలతో ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబానికి గ్రామ సర్పంచ్ దావనమైన సులోచన మల్లేశం యాదవ్ సహకారంతో మానవీయ సహాయం అందించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.గద్ద పెద్ద యాదయ్యకు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. గాయం తీవ్రత పెరిగి కాలి వరకు వ్యాపించడంతో ఒక కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నాలుగు సంవత్సరాల పాటు తీవ్ర బాధలు అనుభవించిన యాదయ్యను ఆయన భార్యే సర్వస్వమై చూసుకున్నారు.ఇటీవల యాదయ్య మృతిచెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.5 లక్షల భీమా మంజూరు అయ్యేలా వార్డు మెంబర్ దార మల్లేశంతో కలిసి డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైరం రమేష్, మంకిడి ప్రభాకర్, గద్ద నరేష్, దావనమైన నర్సింలు, కొప్పు రవి, గద్ద నవీన్, తుమ్మ స్వామి, గద్ద లక్ష్మయ్య, గద్ద నర్సయ్య, పైడి లింగం, గద్ద బాలకిష్టు, గద్ద రామయ్య, పెర్క రజినీకాంత్, పెర్క కిష్టయ్య, పైడి శ్రీకార్, గద్ద రాజయ్య, గద్ద బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.





