నేటి సాక్షి జనవరి 12 పాములపాడు :—వేంపెంట గ్రామంలో మృతిచెందిన టిడిపి పార్టీ కార్యకర్త పట్నం సత్యమయ్య పార్థివ దేహానికి వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ పూలమాలలు వేసి ప్రగాడ సంతాపం తెలిపారు.కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు.ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా తోడుగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో (డిసి)వైస్ చైర్మన్ ఆల్ఫ్రెడ్ మాజీ ఉప సర్పంచ్ సత్యరాజు,మాజీ ఎంపిటిసి శివకుమార్,రాజేష్,ప్రసాద్ రత్నాకర్, కొప్పుల సుధాకర్, సురేష్,పట్నం యోసేపు,కృష్ణ,పట్నం నాగన్న,బోనపల్లె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

