నేటి సాక్షి,నల్లబెల్లి డిసెంబరు 30 :నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పత్తి సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మరణించగా, మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం సమ్మక్క కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిస్తూ, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా వారి కుటుంబ అవసరాల నిమిత్తం క్వింటా బియ్యాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి కోటిలింగచారి, నాగవెల్లి శ్రీనివాస్, పరికి కోర్నెల్, ఐదవ వార్డ్ మెంబర్ ముస్కె చైతన్య&భరత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

