నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి, దాచారం, వీరపూర్, లక్ష్మిపూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు.వీరితో పాటు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బండి రమేష్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ముక్కిస తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ ముక్కిస తిరుపతిరెడ్డి, ముక్కిస రాజిరెడ్డి, సుధీర్ రెడ్డి, బొల్లం పెద్దన్న, తాడిచెట్టు భూమయ్య, వంగల నరేష్ తదితరులు ఉన్నారు.





