నగర మేయర్ గుండు సుధారాణి
- కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే కలసి ప్రారభించిన మేయర్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. శుక్రవారం బల్దియాలోని ఇండోర్ స్టేడియంలో 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా జిడబ్ల్యుఎంసి, మెడి కవర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య, మెప్మా సిబ్బందికి ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే తో కలసి మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కార్యక్రమాల అమలు చేయాలని ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో పట్టణ స్థానిక సంస్థల్లో జూన్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పరిశుభ్రమైన, ఆరోగ్య వంతమైన ఎలాంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా వరంగల్ మహా నగర పాలక సంస్థను నిర్మించే దిశగా చేస్తున్న కృషి లో ప్రతిరోజు ‘ఒక చర్చ ఒక మార్పు’ అనే నినాదంతో ముందుకెళుతున్నామన్నారు. బల్దియాలో మౌలిక సదుపాయాలు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి ప్రజలే ముందు అనే నినాదంతో స్థిరమైన పట్టణాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ వంద రోజుల కార్యక్రమాల భాగంగా శుక్రవారం పారిశుద్ధ్య, మెప్మా సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో డయాబెటిక్ ఆర్తో కార్డియో జనరల్ ఆరోగ్య చెకప్ లతో పాటు దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా స్వయంగా డాక్టర్ ఆయిన కమిషనర్ మేయర్ కు ఆరోగ్య పరీక్షలు చేశారు. కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని పారిశుద్ధ్య కార్మికులు మెప్మా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రేటర్ వరంగల్ నగరాభివృద్ధిలో నగర ప్రజలు భాగస్వాములై
తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ వినోద్, స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, కమిషనర్ అదనపు కమిషనర్ జోన, డాక్టర్ రాజిరెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్, ఇంచార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఆర్టికల్చర్ ఆఫీసర్లు రమేష్, లక్ష్మారెడ్డి,బిడాక్టర్లు సూపర్వైజర్లు, బల్దియా సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

