Monday, March 23, 2026

* *మెగా పేరెంట్స్ మీటింగ్’ కాదు — ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న ‘దగా పేరెంట్స్ మీటింగ్ – చంద్రగిరి నియోజకవర్గం వైయస్సార్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్ రెడ్డి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న “మెగా పేరెంట్స్ మీటింగ్” కార్యక్రమం అసలు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాకుండా, తెలుగుదేశం నాయకులకు వేదిక కల్పించే రాజకీయ ప్రదర్శన మాత్రమేనని వైయస్సార్ విద్యార్థి విభాగం చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షుడు చెంగల్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు సుందరీకరణ, ఇంగ్లీష్ మీడియం, మానిటర్లు, ట్యాబ్లు, తాగునీటి ప్లాంట్లు, పౌష్టికాహార భోజనం వంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఆ సమయంలో ప్రభుత్వ బడులు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క బడికి కూడా కొత్త అభివృద్ధి పనులు జరగలేదని, పేద పిల్లలకు తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెంగల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ముఖ్యమంత్రి–మంత్రులు కూర్చున్న ఫర్నిచర్ కూడా గత ప్రభుత్వమే అందించినదని గుర్తుచేస్తూ, మధ్యన భోజనం సక్రమంగా లేక విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొని పోయి పరిస్థితి ఉంది ఈ కూటమి ప్రభుత్వం లో…విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా జరుగుతున్న ఈ “మెగా పేరెంట్స్ మీటింగ్” అసలు ‘దగా సమావేశం’గా మారిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వైయస్సార్ విద్యార్థి విభాగం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News