నేటి సాక్షి – రాయికల్ (ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐదు వార్డులు బిజెపి కైవసం చేసుకుంది. అయినా కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది. మున్సిపల్ చైర్మన్ పీఠానికి ఇద్దరు కౌన్సిలర్లను మద్దతు తో బిజెపి పీటం దక్కించుకొని పరిపాలన సాగిస్తుందని అందరూ ఊహించుకున్నారు. కానీ కౌన్సిలర్ల మద్దతు లేకపోవడంతో పీఠాన్ని దక్కించుకోక పోవడం గమనార్హం. దీంతో బిజెపి కార్యకర్తలు మరియు నాయకులకు నిరాశే మిగిలింది.





