నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మెట్‌పల్లి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్స్, క్రైమ్ రికార్డులు, వివిధ రిజిస్టర్లు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను సమీక్షించారు.ఎస్పీ మాట్లాడుతూ, సబ్ డివిజన్ పరిధిలో నమోదయ్యే గ్రేవ్ కేసులు, ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చాలా కీలకమని సూచించారు. SOP ప్రకారం దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు.కార్యాలయంలో 5S ఇంప్లిమెంటేషన్‌ను పరిశీలించిన ఎస్పీ, అన్ని ఫైళ్లను శ్రేణీబద్ధంగా, సక్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఐలు, ఎస్సైలు తగిన చర్యలు చేపట్టాలని డీఎస్పీ రాములు గారికి ఆదేశించారు.అదేవిధంగా..రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు.గంజాయి రవాణా, విక్రయంపై నిరంతర నిఘా పెట్టాలని,తరచుగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గంజాయి సమస్యను సమూలంగా నిర్మూలించాలని సూచించారు.కమ్యూనిటీ పొలిసింగ్ ప్రాధాన్యాన్ని వివరించిన ఎస్పీ, స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, DCRB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు అనిల్‌కుమార్, సురేష్ బాబు, ఎస్సైలు కిరణ్‌కుమార్, అనిల్, రాజు, చిరంజీవి, శ్రీధర్ రెడ్డి, నవీన్, రామచంద్రం సహా పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.___





