Saturday, January 17, 2026

*మెట్ పల్లిలో..’గ్యాంగ్ వార్’.!** బరితెగించిన ‘గంజాయి’ ముఠాల వీరంగం* నడిరోడ్డుపై పరస్పర దాడులు, భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు* శాస్త్రి చౌరస్తాలో మూడు గంజాయి గ్యాంగ్ల మధ్య తీవ్ర ఘర్షణ* జనవాసాల్లోకి వ్యాపించిన మత్తు పదార్థాల విక్రయాలు, యువత బానిసలు* ప్రధాన రహదారిపై దాడులు దుకాణాలు మూసివేసి ప్రజలు పరుగులు* పోలీసుల అదుపులో ‘గ్యాంగ్ వార్’ కారకులు.!?———————-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మెట్‌పల్లి పట్టణం గత కొన్ని రోజులుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నమొన్నటి దాకా ‘హనీట్రాప్’ ఉదంతం చర్చల్లో ఉండగానే..మున్సిపల్ ఎన్నికల వాతావరణం సందడిగా నెలకొంది. మధ్యలో సంక్రాంతి పండుగ రావడంతో జనాలు ‘ఫెస్టివల్’ మూఢ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా పట్టణంలో గంజాయి ముఠాలు నడిరోడ్డుపై పరస్పర దాడులు చేసుకుని వీరంగం సృష్టించడంతో కలకలంరేపింది. హాపీగా సంక్రాంతిని ఎంజాయ్ చేద్దామనుకుంటే ఇప్పుడు ఇదేం ‘ట్విస్ట్’ రా అయ్యాని ప్రజల్లో భయయభ్రాంతులకు గురయ్యారు.*​జనవాసాల్లోనే గ్యాంగ్ వార్..!*​గత కొంతకాలంగా పట్టణంలోని శివారు ప్రాంతాలకే పరిమితమైన గంజాయి విక్రయాలు, ఇప్పుడు ఏకంగా జనవాసాల్లోకి చేరాయి. యువత గ్యాంగ్‌లుగా ఏర్పడి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం శాస్త్రి చౌరస్తాలో మూడు ముఠాల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా, అడ్డువచ్చిన వారిని సైతం బెదిరింపులకు గురిచేశారు.*​భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు*​ప్రధాన రహదారిపై, వందలాది మంది చూస్తుండగానే ఈ ‘గ్యాంగ్ వార్’ జరగడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. దుకాణదారులు షాపులు మూసివేసి పరుగులు తీశారు. నిత్యం రద్దీగా ఉండే శాస్త్రి చౌరస్తాలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.*​పోలీసుల నిఘా అవసరం.!*పట్టణంలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మత్తు గ్యాంగ్‌ల దాడులతో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తోంది. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.​మెట్‌పల్లిలో గంజాయి మూలాలను పెకిలించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ వార్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి, కఠినంగా శిక్షించకపోతే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.*పోలీసుల అదుపులో ‘గ్యాంగ్ వార్ కారకులు’.!?*గ్యాంగ్ వార్ కారకులు’గా భావిస్తున్న కొందరిని మెట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.వీరిలో కొందరు సంక్రాంతికి హైదరాబాద్ నుంచి మెట్ పల్లికి వచ్చినట్టు తెలుస్తోంది.వీళ్లలో కొందరు బిటెక్ చదువుతున్న విద్యార్థులని తెలిసింది. ఏదిఏమైనా.? మెట్ పల్లిలో ‘రౌడీల రాజ్యం’ విస్తరిస్తోందన్నది సుస్పష్టం అని జనాలు ముచ్చటించుకుంటున్నారు.!——

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News