నేటి సాక్షి, మెట్ పల్లిబడుగు బలహీన వర్గాల పోరాట వీరుడు జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని శుక్రవారం ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. కొత్త బస్టాండ్ సమీపంలోఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.జయంతి వేడుకల్లో భాగంగా ముదిరాజ్ కాన్సిడెంట్ అడ్వైజర్ డాక్టర్ ఆనంద్ బాబు మాట్లాడుతూ ఆయన కుల రహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల వారికి విద్య కోసం పీడిత ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చి చైతన్యం తెచ్చిన నాయకులు ముదిరాజ్ ముద్దుబిడ్డ జ్యోతి రాజ్ పూలే అని అన్నారు.రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర సెక్రెటరీ తోకల రాజేశ్వర్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఫలాలు అందాయని ఆయన చైతన్యమే పేదవారికి ఈరోజు విద్యావకాశాలు వచ్చాయని అన్నారు.ముదిరాజ్ సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలయేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర సెక్రెటరీ తోకల రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా న్యాయ విభాగ అధ్యక్షులు వెలుగుల రాంబాబు,మాజీ కౌన్సిలర్ యామ రాజయ్య,జక్కం బాబు,తోకల సత్యనారాయణ, మారంపల్లి శ్రీనివాస్,పెద్దగుండ పోచయ్య, మారంపల్లి సాయన్న చేగొండ శ్రీనివాస్, జయరాజు, కృష్ణంరాజు ముదిరాజ్ పట్టణ కుల సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

