Sunday, March 15, 2026

మెడికల్ కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పర్వం కానివ్వము* * మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల వైసిపి ఇన్చార్జ్ కోన రఘుపతి స్పష్టం…

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)గత ప్రభుత్వంలో చేపట్టిన మెడికల్ కళాశాలల ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వము అని మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల వైసిపి ఇన్చార్జ్ కోన రఘుపతి స్పష్టం చేశారు కర్లపాలెం మండలంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఆయన దుకాణాల వెంట తిరిగి మెడికల్ కళాశాలల ఆవశ్యకతను వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నిర్మించి నడిపించడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు మెడికల్ విద్యను అభ్యసించడానికి ఎంతో ముందుకు వస్తారని ఆయన ఆలోచించారన్నారు అంతే కాకుండా బాపట్ల లాంటి ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల టీచింగ్ వైద్యశాల రావటం ద్వారా అభివృద్ధిలో ఇంకా దూసుకు వెళుతుంది న్నారు అదే ప్రైవేటుపరం అయితే దానిని వ్యక్తులు నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటారని సామాన్యులకు ఒరిగేదేమీ లేదా దీనిపై బాపట్ల వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు ఆయన వెంట యువజన రాష్ట్ర కార్యదర్శి జయ భరత్ రెడ్డి మండల కన్వీ నర్ ఏడుకొండలు జిల్లా యూత్ అధ్యక్షుడు చెంచయ్య మండల యూత్ కన్వీనర్ సాగర్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సీతారామిరెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, ఎంపీటీసీ లు ఆసిఫ్ ఆ లీ, అమీర్ ,సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, ఏడుకొండలు, రమేష్, భాను ప్రసాద్ బెనర్జీ రత్నం శ్రీపతి ఆల రవి ధనుంజయ రెడ్డి అయ్యప్ప రెడ్డి నాగిరెడ్డి కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరెడ్డి కావూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News