నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని మూసుకుపోయిన కూటమినేతల కళ్ళు తెరిచేలా చేశాయని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోని ప్రతి చోట వందలాదిమంది స్వచ్ఛందంగా వైసీపీ శ్రేణులు తరలిరావడం హర్షించదగ్గ విషయమని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని దీన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పి విద్య వైద్యం పేద ప్రజల నుంచి దూరం చేయాలని భావిస్తున్న కూటమి నేతల కుట్రలు చిన్నాభిన్నమైందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నెన్నో హామీలు ఉసిగొల్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఒక్క పథకాన్ని ఆచరణలోకి తీసుకోకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన కూటమి 18 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. అభివృద్ధి గంగలో కలిసింది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కేవలం స్కామ్‌లకు మాత్రం తెర లేపారని గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. ”మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయని ఈ వ్యతిరేకతను గురువారం సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ నజీర్ అహ్మద్ ను వైయస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం దారుణం. దీని వెనుక పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతారా అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్‌కే అప్పగిస్తారేమోనని ఏం మేలు చేశారని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో కోటి సంతకాల ద్వారా తేటతెల్లం అయింది. ప్రజల డిమాండ్, వారి ఆకాంక్షను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని గుడివాడ్ అమర్నాథ్ పేర్కొన్నారు.~~~~~~~~~~~~~~~~~~





