నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ అట్టహాసంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టగా ఒకే రోజు వెయ్యి మంది తమ సంతకం పెట్టి మద్దతు తెలిపారు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న సంతకాల సేకరణకు ప్రజల నుంచి స్పందన లభిస్తుండటంతో పార్టీ నేతలు మరింత ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని జనం మద్యకు తీసుకువెళుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్న తరుణంలో చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన విద్యార్థి విభాగం నేతలు ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన సంతకాల సేకరణకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆద్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థి విభాగం నేతలు వర్శిటీ వద్దకు చేరుకుని కూటమి ప్రభుత్వం వైద్యవిద్య, ప్రభుత్వ ఆసుపత్రిలను ప్రయివేటు పరం చేయాలని చేడటాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ చేపడుతున్న చేపట్టే కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్రజలతో పాటు వర్శిటీ విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు సైతం తమ మద్దతును తెలిపుతూ సంతకాలు చేశారు. గురువారం ఉదయం 9గంటల నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణ మధ్యాహ్నం 1గంటల వరకు జరిగింది. ఆ సమయంలో సుమారు వెయ్యి మంది స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి తమ మద్దతు తెలియపరచడం చూస్తుంటే ప్రయివేటీకరణకు ఎంత మంది వ్యతిరేకంగా వున్నారన్న విషయం అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు చెంగల్ రెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రేమ కుమార్, విద్యార్థి విభాగం మండలాల అధ్యక్షులు నక్క హరినాథ్, శేష రెడ్డి, వెంకటరమణ నాయక్, వర్శిటీ విద్యార్థి నేతలు ముని, హరినాయక్ ,లిఖిత్ ,సతీష్, మహేష్, నవీన్, నీరజ్ రెడ్డి, సాయితదితరులు పాల్గొన్నారు.





