Wednesday, January 21, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

ఎంజీఎం దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు కృషి చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి ఐసీసీయు, పిడియాట్రిక్స్, జనరల్, ఓ పి, పేషేంట్ అటెండెంట్స్ నిరీక్షణ గది, తదితర విభాగాలను
పరిశీలించారు.
దవాఖానల్లో మౌలిక వసతులు, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్, ఆర్‌ఎంవో, విభాగాధి పతులను అడిగి తెలుసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య అధికారులతో క్షేత్ర స్థాయిలో కలియతిరిగి ఆసుపత్రి, పరిసరాలు, పారిశుద్ధ్యం పరిశీలించి సమస్యలు తెలుసుకొని పరిష్కరణకు తగు సూచనలు చేశారు.
ఆసుపత్రి ఆవరణలో ఉన్న క్యాంటీన్ ను ఇతర స్థానానికి మార్చాలని, అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి అందుతున్న వైద్యం పట్ల తెలుసుకున్నారు. హృదయ చికిత్స విభాగంలో అమర్చిన కంప్లైంట్ బాక్స్ ను కలెక్టర్ తెరవగా, సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని , సిబ్బంది దురుసుగా వ్యవహిసృన్నారని ఫిర్యాదులో పేర్కొనగా కలెక్టర్ తీరును మార్చుకొని మానవతా దృక్పథంతో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండాలని సూచించారు వైద్యులు సిబ్బందికి ఐడి కార్డులు ఉండాలన్నారు. దవాఖాన ఆస్తుల రక్షణ, రోగుల భద్రతా విషయంలో సెక్యూరిటీ సంస్థ బాధ్యత వహించాలని, జూనియర్‌ డాక్టర్లతో పాటు సెక్యూరిటీ, శానిటరీ, పేషెంట్‌ కేర్‌ సిబ్బందికి వేర్వేరుగా భద్రతా అంశాలపై కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంజిఎం పర్యవేక్షకులు కిశోర్, డి ఎం హెచ్ ఓ, ఎంపిడిసిల్ డీఈ మల్లికార్జున్, డిబిసిడిఓ పుష్పలత,ఆర్ ఎం ఓలు,వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News