నేటి సాక్షి- మేడిపెల్లి (దుమాల అనీల్): ఎన్నో ఏళ్లుగా కళాశాల విద్యకోసం ఎదురుచూస్తున్న మేడిపల్లి బీమారం ఉమ్మడి మండలాల ప్రజలకు ఊరట నిచ్చే విధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో శనివారం మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులను పరిసరాలను జిల్లా అధికారి నారాయణ పరిచీలించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలతో ఈ విద్యా సంవత్సర నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించడానికి కావలసిన మౌలిక సదుపాయాలను వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ సహకారంతో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు…స్థానిక కాంగ్రెస్ నాయకులతో పరిశీలించడం జరిగింది.
వారి వెంట ఉమ్మడి మేడిపెల్లి మండల మార్కెట్ కమిటీ చెర్మన్ మాదం వినోద్ మేడిపెల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, భీమారం మండల అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మేడిపెల్లి మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజ్, మండల ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు బలగం రాజేష్, మార్గం నవీన్, గంగశేకర్, రాజు, సంజీవ రెడ్డి తదిరులు ఉన్నారు..