(నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)(అక్టోబర్ 14):జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం గంజాయి పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్సై M. శ్రీధర్ రెడ్డి తెలిపారు.మేడిపల్లి పోలీసు వారికి మేడిపల్లి గ్రామ శివారులో ఒక వ్యక్తి అతని పేరు బద్దం నాగరాజు s/o సాయి రెడ్డి, 26 yrs, గుడేటి కాపు r/o తాండ్రియాల v/o కథలాపూర్ మండలం అనుమానంగా కనిపించగా అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 200 గ్రాముల గంజాయి దొరికినది. అట్టి వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని ఆయన కోరారు.గంజాయి కలిగి ఉన్నా, విక్రయించినా, సరఫరా చేసినా, వారికి సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.గంజాయి పట్టుకున్న మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డిని, కానిస్టేబుల్ నాగరాజుని మరియు సిబ్బందిని SP అశోక్ కుమార్ ఐపీఎస్, మెట్పల్లి DSP A. రాములు, కోరుట్ల CI B. సురేష్ బాబు అభినందించారు.





