నేటి సాక్షి డిసెంబర్ 30 మొయినాబాద్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం లో సర్పంచిగా ఎన్నికైన 15 రోజుల్లోనే గ్రామంలోకి వెళ్లే రోడ్డులను మరమ్మత్తుల కోసం అధికారులను సంప్రదించి ప్రారంభించనున్న సర్పంచ్ ప్రొద్దుటూరు గేటు నుండి మేడిపల్లి వరకు ఉన్న రోడ్డు గుంతలుగా మారడంతో ప్రయాణికులకు రాకపోకలు చాలా ఇబ్బందిగా మారాయి. ఈరోజు రోడ్డు నిర్మాణానికి కావలసిన సర్వే చేయించారు మేడిపల్లి గ్రామ సర్పంచ్ మల్కాపురం శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ ఉపసర్పంచ్ జొన్నాడ ప్రభాకర్,కావలి నవీన్ ,మొగలిగిద్ద మహేష్, , బట్టు శ్రీశైలం, తలారి రామచందర్,కుమ్మరి శేఖర్,కొత్తపల్లి బాలరాజ్, P. రమేష్ ,గోడల రాఘవేందర్, చీమల మధుకర్, మాజీ సర్పంచ్ నవీన్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది…

