నేటి సాక్షి చిలుకూరు ఫిబ్రవరి 28 (మొక్క వెంకన్న గౌడ్)మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని చిలుకూరు ఎస్సై హనుమాన్ నాయక్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారణంలేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్స హించవద్దని, దానితో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. మైనర్స్ డ్రైవింగ్ చేయడం వలన ఎన్నో ప్రాంతాల్లో అనేక ప్రాణాలు పోయాయనీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణంమై ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే 10 సంవత్సరాల కఠిన శిక్షలు పడేల చట్టాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు అవుతాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని 18 సంవత్సరాలు నిండాని పిల్లలు వాహనాలు ఇవ్వద్దన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందన్నారు. పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. మైనర్ డ్రైవింగ్ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.





