- -మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
నేటి సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ఈ ఏడాది నీట్- 2024 పరీక్ష రాసి, అర్హత సాధించని మైనార్టీ విద్యార్థుల కోసం నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్‌ను ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. వందలాది మంది మైనార్టీ విద్యార్థులు నీట్ పరీక్ష రాసి, సరైన కోచింగ్ లేని కారణంగా అర్హత సాధించలేకపోతున్నారని, దీంతో మెడికల్ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏ విధంగా నీట్-2025 కోచింగ్‌ను అందిస్తున్నారో, అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు హైదరాబాద్‌లోని సీవోఈ క్యాంపస్‌లలో ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ, ప్రత్యేక కార్యదర్శి మైనార్టీ సంక్షేమ శాఖ తఫ్సీర్ ఇక్బాల్, మైనార్టీ గురుకుల సంస్థ కార్యదర్శి ఆయోషా మస్రత్ ఖానం, మైనార్టీ గురుకుల సంస్థ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు.