Monday, December 23, 2024

మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయండి

  • మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీల మాదిరిగా విద్యనందించాలి
  • మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

నేటి సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థుల కోసంగురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 8000 మంది విద్యార్థులకు పైగా ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటికి వెళ్తున్నారని, మైనార్టీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్థులు నాలుగు ఏండ్లుగా ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, మైనార్టీ డిగ్రీ కళాశాలలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉమ్మడి జిల్లాకు ఒక్కటైనా మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్చి నెలలో లేఖ రాసినట్టు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తే, డ్రాప్అవుట్స్​ను తగ్గించి, మైనార్టీ విద్యార్థులకు బంగారు భవిష్యత్​ను అందించిన వారవుతారని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News