*నేటి సాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ భ్రమరాంబ సమేత స్వయంభు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా వివిధ రాష్ట్రాల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. అనంతరం ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ తెలిపారు.

