నేటి సాక్షి,గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్ ):* గన్నేరువరం మండలంలోని చాకలి వానపల్లి గ్రామంలోని కూనవాని పల్లె లో యువ రైతు కూన చంద్రశేఖర్ వరి పంట మొథా తుపాన్ దాటికి పూర్తిగా నేల రాలింది. రైతు మాట్లాడుతూ పొట్ట దశకు వచ్చిన వరి పంట కూడా నేలకొరిగి రైతులకు తీవ్ర విషాదం మిగిల్చింది పంటలు చేతికందే దశలో వర్షాలు తుఫాన్లు రైతులకు విషాదాన్ని మిగిల్చాయి అంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 35 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని యువ రైతు కూన చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.





