నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………….జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి అని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు.సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు.





