Friday, March 13, 2026

మొల్ల స్ఫూర్తితో మహిళలు ఉన్నత విద్యలో ముందుకు రావాలి

నేటి సాక్షి గజ్వేల్:సుప్రసిద్ధ తెలుగు కవయిత్రి అటుకూరి మొల్ల స్ఫూర్తితో కుమ్మరి కులానికి చెందిన మహిళలు చదువులో ముందంజలో ఉండి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గజ్వేల్ మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు నాగపురి బాబు అన్నారు. గజ్వేల్ పట్టణంలో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్, గజ్వేల్ మండల అధ్యక్షుడు నాగపురి బాబు మాట్లాడుతూ మొల్ల తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే కవయిత్రి అని తెలిపారు.సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ తన ప్రతిభతో మొల్ల రామాయణం రచించి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప కవయిత్రి మొల్ల అని పేర్కొన్నారు. ఆమె జీవితం మహిళలకు గొప్ప స్ఫూర్తి అని అన్నారు.కుమ్మరి కులానికి చెందిన మహిళలు కూడా మొల్లను ఆదర్శంగా తీసుకొని విద్యలో రాణించి సమాజంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం అమ్మాయిల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యూత్ అధ్యక్షుడు నాగపూర్ చందు లతోపాటు సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కవయిత్రి మొల్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News