Wednesday, March 11, 2026

మోటార్ వైరు దొంగల అరెస్టు

నేటి సాక్షి – జగిత్యాల ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : జగిత్యాల పట్టణ శివారు ప్రాంతమైన హస్నాబాద్ – చలిగల్ గ్రామాల సరిహద్దులో డిమార్ట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ అనుకొని రైతులు ఒక షెడ్డులో ఎనిమిది క్వింటాళ్ల వరి ధాన్యాన్ని నిల్వ ఉంచగా అందులో నుండి దాదాపు 6 క్వింటల్లా వరి ధాన్యం ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం రైతులు కాపు కాసి దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద దాదాపు 50 వ్యవసాయ బావి మోటార్లకు సంబంధించిన కాపర్ వైర్ లభ్యమైంది. గత కొన్ని రోజులుగా చలిగల్, హస్నాబాద్, ఉప్పర్ పెట్ శివారు ప్రాంతాల రైతులకు సంబంధించి 50 నుండి 100 మోటార్లు చోరీకి గురయ్యాయయనిఒక్కో వ్యవసాయ బావి మోటార్ మరియు వైరు విలువ 30 వేల వరకు ఉంటుందని దాదాపు రైతులకు లక్షలలో నష్టం జరుగుతుందని వారికి అవి అమ్ముతే కేవలం వారికి వచ్చే 3000 కోసం మమ్మల్ని లక్షలలో నష్టాలపాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు రైతులు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News