నేటి సాక్షి రామడుగు ( పురాణం సంపత్ )రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ పాఠశాలలో పలు సబ్జెక్టులకు సంబంధించి నియమకాలు చేపడుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఎకనామిక్స్ -1, టీజిటి తెలుగు-1, టీజీటీ హిందీ -2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులు తప్పనిసరిగా పీజీ తో పాటుగా బీఈడీ, టెట్ అర్హత ఉన్నవారు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు.

