నేటి సాక్షి, రాజేంద్రనగర్: వరుసగా నరేంద్ర మోదీ ప్రధానిగా మూడో సారి ప్రమాణం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఢిల్లీలో మోదీ ప్రమాణం చేసిన వెంటనే, మణికొండ మున్సిపాలిటీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ దృశ్యాలు మీ కోసం..