నేటి సాక్షి మార్చి 22 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు తెలిపారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డుల్లో రూ.13 లక్షల TUFIDC నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు, అమ్మ గార్డెన్ నేషనల్ హైవే పై రూ.1.80 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులకు, అలాగే అమరావతిలో రూ.1.50 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారితో కలిసి మంత్రి గారు ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.200 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.అయితే, గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని మంత్రి గారు ఖండించారు. గత ప్రభుత్వ కాలంలో అభివృద్ధి శూన్యమని, ఆ సమయంలో నాయకులు కమిషన్ల కోసం మాత్రమే పనులు చేసి ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారూ





