Friday, March 13, 2026

యథేచ్ఛగా అక్రమ మట్టి దందా..తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత! నిద్రమత్తులో సంబంధిత అధికారులు..?

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:*జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ లో మట్టి దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది.ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కళ్ళ ముందు నుంచే మట్టి తవ్వి రవాణా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు మట్టి వ్యాపారులు.అక్రమంగా మట్టి దందా కాసుల వర్షం కురిపిస్తుంది.*చట్టాలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ లేని టాక్టర్లు మైనర్ తో జెసిపి డ్రైవర్ తమకు నచ్చిన రీతిలో వ్యవహరిస్తున్న మట్టి మాఫియా..?**రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియాల పై గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News