నేటిసాక్షి, మిర్యాలగూడ(వేములపల్లి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కావాలంటే యాప్ లో నమోదు చేసుకుంటూనే అందజేస్తున్న నేపథ్యంలో రైతన్నలు యాప్ పైన పూర్తి అవగాహన లేకపోవడంతో సకాలంలో యూరియా అందించక, పంట నష్టపోతున్నామని, వెంటనే యాప్ ను రద్దు చేసి, పాత పద్దతిలోనే యూరియాను అందజేయాలని రైతులు కోరుతున్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండల కేంద్రంలోని నార్కెట్ పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా రైతులు విలేకరులతో మాట్లాడుతూ, యాప్ తో చదువురాని రైతులు, స్మార్ట్ ఫోన్ ల్ బుకింగ్ చేసుకొనే విధానాం తెలియక పోవడంతో పంటకు సకాలంలో అందాల్సిన యూరియా అందక దిగుబడి తగ్గిపోతుందని, బుక్ చేసుకునేందుకు యాప్ లో వొచ్చిన యూరియా స్టాక్ వొచ్చినట్లే మాయం అవుతుందని, వెంటనే యాప్ విధానం రద్దు చేసి, పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.





