లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్.
*విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన.
లక్షెట్టిపేట: యువత మత్తులో చిత్తుచిత్తు కాకూడదని, గంజాయి, మద్యంకూ బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని లక్షట్ పేట ఎస్సై గోపతి సతీష్ పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని గుడ్ షెఫెర్డ్ స్కూల్ విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ….. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి అన్నారు.విద్యార్థులు ఎవరు డ్రగ్స్ కు అలవాటు కావద్దని తెలిపారు.విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు పై శ్రద్ధ వహించాలని పట్టుదల క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకోని రావాలని సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థుల తో కలిసి మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు మొక్కలు చాలా అవసరం అని ప్రతి ఒక్కరు విధిగా తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈకార్యక్రమం లో పాఠశాల కరెస్పాండంట్ వై.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెభాస్టియన్,ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

