నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ *యువత దూకుడుతో ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి కి విశేష ఆదరణ*. *పేదల కోసం హామీల్లో స్పష్టత చూపుతున్న శ్రీకాంత్ రెడ్డి*. *ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్న ఉంగరం గుర్తు – ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి*తంగడపల్లి – మడికట్టు గ్రామాల్లో ఎన్నికల సందడి ఉరకలేస్తోంది. ఈ సందడిలో ప్రజల దృష్టిని బలంగా ఆకర్షిస్తున్న పేరు ఒక్కటే — ఉంగరం గుర్తుతో ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి. ఇచ్చిన మాట తప్పకుండా, గ్రామ సమస్యల పట్ల నిజమైన పట్టుదల, అందరి మధ్యలో ఉండే సాదాసీదా స్వభావం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది.ప్రచారంలో విశేషంగా కనిపిస్తున్న విషయమేమిటంటే యువత నుంచి వస్తున్న అత్యద్భుత మద్దతు. గ్రామం లో ఎక్కడ తిరిగిన… ప్రతి వీధిలోనూ… ప్రతి ఇంటి వద్ద… యువతే ముందుంటోంది. “మన గ్రామం కోసం నిజంగా పని చేసే మన మనిషి శ్రీకాంత్ అన్నగారు కావాలి” అని వారు ఉత్సాహంగా చెబుతున్నారు. బైకులపై తిరిగి ప్రచారం చేయడం, రాత్రివేళల వరకూ సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఓటు కోసం ప్రజలకు ఆయన గురించి చెప్పడం — ఇలా యువతే ప్రచార బలం అయ్యింది. ఈ యువ శక్తి ప్రచారాన్ని గాలి కాదు… దుమారంగా మారుస్తోంది.గ్రామాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న హౌస్ పన్ను సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని శ్రీకాంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ప్రతి ఇంటికి రాతపూర్వకంగా హౌస్ పన్ను మాఫీ పత్రం ఇస్తానని చెప్పడంతో గ్రామాల్లో చర్చ చెలరేగింది. “పేదలపై పన్నుల భారమేమీ ఉండకూడదు” అనే ఆయన మాట ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది.తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉచిత నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఆశ. గ్రామంలో ప్రతి కుటుంబానికి శుద్ధమైన నీరు ఉచితంగా అందుబాటులోకి రానుందన్న విషయం ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.గ్రామ పిల్లల చదువు కోసం కూడా ఆయన ప్రత్యేకంగా ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు, చెప్పులు, చదువు సామగ్రి అందిస్తానని చెప్పారు. పాఠశాల పరిసరాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది.పేద కుటుంబాల్లో పుట్టే ఆడశిశువులకు జననం వెంటనే పదకొండు వేలు అందిస్తానన్న హామీ మహిళల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఆడపిల్ల పుట్టుకకు గౌరవం పెరిగేలా, కుటుంబానికి భరోసా కలిగేలా ఆయన తీసుకువస్తున్న ఈ నిర్ణయం గ్రామ మహిళల హృదయాలను గెలుచుకుంటోంది.ఆరోగ్య సేవల పరంగా గ్రామం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం దూరం వెళ్లాల్సిన పరిస్థితిని మార్చేందుకు గ్రామంలోనే వెంటనే స్పందించే వైద్య సేవలు అందుబాటులోకి తెస్తానని చెప్పారు. తంగడపల్లిలో శాశ్వత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం అధికారులతో నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. “గ్రామ ప్రజల ఆరోగ్యం నాకు మొదటి ప్రాధాన్యత” అనే ఆయన మాట ప్రజల్లో నమ్మకాన్ని నింపింది.గ్రామాన్ని ఆధునీకత దిశగా తీసుకెళ్లేందుకు బ్యాంకు శాఖను గ్రామంలోనే ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులు, విద్యార్థులు సౌకర్యంగా ప్రయాణించేందుకు హైదరాబాద్ – వికారాబాద్ మార్గంలో తంగడపల్లి మీదుగా బస్సు సేవలను ప్రారంభించే యత్నం చేస్తానని తెలిపారు. గ్రామ ప్రధాన ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తానన్న నిర్ణయం యువతలో ఆనందాన్ని కలిగిస్తోంది.ప్రతి రోజు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు వినడం, వెంటనే స్పందించడం, ఎవరికైనా అవసరం ఉన్నా పక్కనే నిలబడడం — ఇవన్నీ ఆయనను ప్రజల హృదయాల్లో నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా నిలబెట్టాయి. “మీ సమ్మకం… మీ ఆశీర్వాదం… యువత విశ్వాసం… ఇవే నా బలం” అని ఆయన చెప్పిన మాటలు గ్రామ ప్రజల మనస్సుల్లో దృఢంగా నాటుకున్నాయి.





