వినాయక మండపాల వద్ద మాజీ మంత్రి ప్రత్యేక పూజలు
…మాజీ మంత్రి జీవన్ రెడ్డి
నేటి సాక్షి, రాయికల్,:
యువత సేవా భావాన్ని అలవర్చుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాయికల్ పట్టణంతోపాటు మండలంలోని ఇటిక్యాల్ యువజన, కుల సంఘాలు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేసి మండపం నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడిన జీవన్ రెడ్డి “గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సౌఖ్యం, అభివృద్ధి, శాంతి నెలకొనాలి” అని ఆకాంక్షించారు. యువజన సంఘాలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ముందుండి పనిచేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో యువత శ్రద్ధ చూపడం అవసరమని చెప్పారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,నాయకులు బాపురపు నరసయ్య, కొమ్ముల ఆదిరెడ్డి,బొడ్గం అంజిరెడ్డి,కడుకుంట్ల నరేష్, కొత్తపెళ్లి గోపాల్,సామల్ల వేణు,వాసం దిలీప్,దువ్వక రాజారెడ్డి,గుండేటి ఆనందం,కాశవేణి రాజేష్, యువజన, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





